అభిమానుల్ని కాదని మహేష్ అంత రిస్క్ తీసుకుంటాడా..!

శ్రీవిష్ణు హీరోగా లవ్ లీ సింగ్ హీరోయిన్ గా అనీష్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. ఈ చిత్రం మార్చి 11న విడుదలయ్యి ప్లాప్ గా మిగిలింది. మినిమం ఓపెనింగ్స్ ను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. అయితే ఈ చిత్రానికి మహేష్ బాబు కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా… ‘గాలి సంపత్’ కు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాదు స్క్రీన్ ప్లే ను కూడా అందించాడు. డైరెక్టర్ గా అన్ని సినిమాలు హిట్లు కొట్టిన అనిల్..

ప్రొడ్యూసర్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.అందులోనూ అతని స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ‘అవుట్ డేటెడ్’ అంటూ ప్రేక్షకులు ఈ చిత్రం పై విమర్శలు గుప్పించారు. ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రం పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా ఉంటుందని ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తుంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తో మహేష్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందించిన అనిల్.

ఆ చిత్రంలో మహేష్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను కలగలిపి వడ్డించాడు. అందుకే మహేష్ కూడా రాజమౌళితో సినిమా పూర్తయ్యేలోపు అనిల్ రావిపూడితో సినిమా చేస్తేనే కరెక్ట్ అని భావిస్తున్నాడట. కానీ ‘గాలి సంపత్’ సినిమా రిజల్ట్ వల్ల అతనితో సినిమా వద్దని మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మహేష్ కు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. మరి అభిమానుల్ని కాదని మహేష్.. అనిల్ తో సినిమా చేస్తాడో లేదో చూడాలి.!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus