ఎన్టీఆర్, మహేష్.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సత్య దేవ్ సినిమా..!

ఈరోజు ఏమాత్రం చప్పుడు చేయకుండా ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ అనే చిత్రం ఓటిటిలో విడుదల అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.’కేరాఫ్ కంచెరపాలెం’ చిత్రాన్ని తెరకెక్కించిన మహా వెంకటేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఓ పెద్ద వివాదానికి తెరలేపినట్టు అయ్యింది. అది కూడా మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య.! ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

దీనికి కారణం ఏంటంటే.. ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రంలో సుహాస్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో అతను ఒక అమ్మాయి దగ్గర… ‘మహేష్ బాబు అయితే ఉన్న చోట నుండీ కదలకుండా చంపేస్తూ ఉంటాడు- ‘వెరీ లేజీ’, అదే ఎన్టీఆర్ అనుకో వెంబడి పడి పడి నరికేస్తుంటాడు-‘సో క్రేజీ’ ‘ అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. ఇక్కడ మహేష్ బాబుని ‘లేజీ’ అన్నందుకు డైరెక్టర్ వెంకటేష్ మహా పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

‘టాలీవుడ్ లో డూప్ లేకుండా ఎన్నో స్టంట్ లు చేసేది మహేష్ బాబు మాత్రమేనని ఎంతో మంది డైరెక్టర్లు చెప్పిన సంగతి ఈ దర్శకుడు మర్చిపోయినట్టు ఉన్నాడు. వెంటనే ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ టీం.. మహేష్ బాబుకి అలాగే ఫ్యాన్స్ కు ‘అపాలజీ’ చెప్పాలి అంటూ ‘#UMURteamShouldApologizeMaheshBabu’ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ విషయం పై ఆ చిత్రం యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus