త్రివిక్రమ్ కి టార్గెట్ ఫిక్స్ చేసిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి సినిమాలు వచ్చాయి. ‘అతడు’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఖలేజా’ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు కానీ ఇప్పటికీ ఈ సినిమాను టీవీలో ప్రసారం చేస్తే జనాలు టీవీలకు అతుక్కుపోతారు. అంతగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అభిమానులు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. అయితే దానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.

ముందుగా మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి చేయాలి. ఆ తరువాతే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది. అయితే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సివుంది. ఆ తరువాతే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుంది. అయితే మహేష్ మాత్రం ఈ విషయంలో త్రివిక్రమ్ ని తొందర పెడుతున్నాడని సమాచారం. అక్టోబర్ నాటికి సినిమా మొదలుపెట్టేయాలని.. త్రివిక్రమ్ కి టార్గెట్ ఫిక్స్ చేశాడట.

అయితే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అప్పటికి పూర్తయ్యే ఛాన్స్ లేదు. ‘సర్కారు వారి పాట’ సంక్రాంతికి వస్తోంది. వీలైనంత తొందరగా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి బయటపడాలని చూస్తున్నాడు మహేష్. త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ అయితే.. వేగంగా రాజమౌళి సినిమా మొదలుపెట్టాలనేది మహేష్ ప్లాన్. అయితే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే మహేష్ కి మాట ఇవ్వలేకపోతున్నాడట త్రివిక్రమ్.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus