Mahesh Babu: మహేష్ – పూరి… ఛాన్స్ లేదు

పూరి జగన్నాథ్ ఒక హీరోతో సినిమా అనుకున్నాడు అంటే ఒకప్పుడు వెంటనే సెట్టయ్యేది. హీరోలు కూడా ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. నిర్మాతలు కూడా ఆయన తొందరగానే షూటింగ్ పూర్తి చేస్తారని రెడీగా ఉండేవారు. కానీ ఆయన వరుస అపజయాల అనంతరం ఎవరు అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చినప్పటికి కథ నచ్చితేనే ఒప్పుకుంటున్నారట. ఇతర దర్శకుల తరహాలోనే పూరి లాక్ డౌన్ లో కొంతమంది హీరోలను కలిశాడట.

కానీ అగ్ర హీరోలు బిజీ అంటూ తప్పించుకున్నట్లు టాక్ వస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్న పూరి ఈ సినిమా అనంతరం మహేష్ బాబుతో చేయనున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ త్రివిక్రమ్ సినిమా అయిపోగానే రాజమౌళి కోసం షూటింగ్ మొదలవ్వ ముందే కొంత ఫిట్నెస్ లో మార్పులు చేయనున్నాడట. అలాగే వర్క్ షాప్ కూడా ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఆ సినిమా మొదలైతే ఎంత కాదనుకున్న రెండేళ్ల సమయం పడుతుంది. కాబట్టి వచ్చే ఏడాది పూరి, మహేష్ కాంబో సెట్స్ పైకి రానున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus