Mahesh Babu,Ramesh Babu: సోదరుడి మృతిపై ఎమోషనల్ గా స్పందించిన మహేష్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక మరణవార్త అందరినీ ఎంతగానో కలచివేస్తోంది. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణంపై ప్రతీ ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇక రమేష్ మృతి పై టాలీవుడ్ సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రమేష్ బాబు అంత్యక్రియలు కూడా ముగిశాయి. సోదరుడు రమేష్ బాబు మృతిపై మహేష్ బాబు మొదటి సారి సోషల్ మీడియా ద్వారా తన వివరణ ఇచ్చారు.

నువ్వే నాకు స్పూర్తి అంటూ నీవే నా బలం నువ్వు నా ధైర్యం అని తెలియజేశారు. అంతే కాకుండా నీవే నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి… విశ్రాంతి తీసుకోండి.. మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా మీరే నా అన్నయ్య గానే ఉండాలి.. అంటూ ఇప్పటికి ఎప్పటికి మిమ్మల్ని ప్రేమిస్తునే ఉంటానని మహేష్ వివరణ ఇచ్చారు.

మహేష్ బాబు సోషల్ మీడియాలో వివరణ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అతని సోదరుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నప్పుడు మహేష్ ఎక్కువగా తండ్రితో కంటే తన అన్నయ్య తోనే ఎక్కువగా అన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో రమేష్ బాబు తన తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక తండ్రి తరువాత తండ్రి బాధ్యతను తీసుకున్నాడు.

అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా కొన్ని అపజయాలు అందుకున్న సమయంలో కూడా భుజం తట్టే ఎన్నోసార్లు ధైర్యం చెప్పాడు. బయట ప్రపంచానికి వీరిద్దరూ కలిసి ఎక్కువగా కనిపించకపోయినా కూడా మహేష్ బాబు రమేష్ బాబు రెగ్యులర్ గా కలుసుకుంటూనే ఉంటారట. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని అంటుంటారు. ఇక సోదరుడి మరణ వార్తతో తో మహేష్ బాబు తీవ్రస్థాయిలో మనోవేదనకు గురైనట్లు గా అనిపిస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus