Mahesh Babu: ఆ కంపెనీకి సైతం ప్రచారకర్తగా మహేష్.. ఎవరూ పోటీ ఇవ్వలేరుగా!

  • June 14, 2024 / 11:12 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మహేష్ సినిమాలకు దూరంగా ఉన్నా వరుసగా యాడ్స్ లో నటించడం ద్వారా సత్తా చాటుతున్నారు. ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ యాడ్స్ లో నటించడం ద్వారా మహేష్ బాబుకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.హొజైరీ ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబును నియమించుకున్నామని డాలర్ ఇండస్ట్రీస్ కంపెనీ వెల్లడించింది.

మహేష్ ఇప్పటికే ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన ఖాతాలో మరో బ్రాండ్ చేరడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ బ్రాండ్ కోసం మహేష్ బాబు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటిస్తూ ప్రశంసలు పొందడంలొ మహేష్ బాబుకు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ బాబు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. మహేష్ కొడుకు గౌతమ్ వ్యాయామం చేస్తున్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. గౌతమ్ హీరోగా సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.

మహేష్ బాబు కెరీర్ ప్లాన్స్ సైతం భారీ స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ను ఎంపిక చేసుకుంటారో చూడాల్సి ఉంది. మరో రెండు నెలల తర్వాత మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus