Mahesh Babu: బాలీవుడ్‌ ఎంట్రీ పుకార్లపై మహేష్‌బాబు ఏమంటాడో?

టాలీవుడ్‌లో ఉంటూ బాలీవుడ్‌ కటౌట్‌, ఆ మాటకొస్తే హాలీవుడ్‌ కటౌట్‌ ఉన్న హీరోల్లో మహేష్‌బాబు ఫస్ట్‌ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ పాన్‌ ఇండియా సినిమా అంటున్నారు కానీ, మహేష్‌ను చూసి ‘బాలీవుడ్‌కి ఎప్పుడొస్తారు’ అని చాలాసార్లు అడిగారు మీడియా జనాలు. ప్రతిసారి ‘నేనెక్కడికీ వెళ్లను… ఇక్కడే ఉంటా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎనిమిది తొమ్మిదేళ్ల క్రితం అదే మాట, మొన్న ఏడాది క్రితమూ ఇదే మాట. అయితే తాజా వార్తల ప్రకారం చూస్తే మహేష్‌ మాట తప్పేలా ఉన్నాడనిపిస్తోంది.

బాలీవుడ్‌లో త్రీడీ రామాయణం తెరకెక్కించాలని చాలా రోజుల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత మధు మంతెన, ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కలసి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో రామాయణం తెరకెక్కించాలనేది వారి ఆలోచన. అయితే అది ఓకే అయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పుడు వారి చూపు మహేష్‌బాబుపై పడిందట. ఈ సినిమా టీమ్‌ ఇప్పటికే మహేష్‌ను కలిశారట. దీంతో చాలా ఏళ్లుగా మహేష్‌ జపిస్తున్న ‘నో బాలీవుడ్‌’ మంత్రానికి నీళ్లొదిలేస్తాడా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పాన్‌ ఇండియా సినిమా జపం నడుస్తున్న ఈ రోజుల్లో మహేష్‌ బాలీవుడ్‌వైపు చూడటం పెద్ద విషయమేమీ కాదు. ‘బాలీవుడ్‌కి వెళ్లను అన్నారు కదా’ అని ఎవరైనా మహేష్‌ను అడిగితే… ‘ఇది బాలీవుడ్‌ సినిమా కాదు… పాన్‌ ఇండియా సినిమా’ అని చెప్పే అవకాశాలూ ఉన్నాయి. చూద్దాం మహేష్‌ మాట తప్పి… పాన్‌ ఇండియా జపం పఠిస్తాడా? లేక ‘నో బాలీవుడ్‌’ మంత్రాన్నే పఠిస్తాడా?

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus