Mahesh Babu: చిన్నారుల విషయంలో మహేష్ దేవుడే.. అలా చేస్తూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనే సంగతి తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు సహాయం చేసే విషయంలో మహేష్ బాబు ముందువరసలో ఉంటారు. తను సంపాదించే డబ్బులో కొంత మొత్తాన్ని మహేష్ బాబు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలకు నమ్రత కూడా తన వంతు సహాయసహకారాలను అందిస్తున్నారు. నిన్న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కాగా ఏకంగా 30 మంది చిన్నారులకు మహేష్ బాబు గుండెకు సంబంధించిన సర్జరీలు చేయించారు.

మహేష్ బాబు భార్య నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. తమ ఫేవరెట్ హీరో మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాల విషయంలో అభిమానులు సైతం గర్వంగా ఫీలవుతూ ఉండటం గమనార్హం. మహేష్ బాబు చాలా మంచి పని చేస్తున్నారని మహేష్ చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాలు సంతోషంలో ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు మహేష్ నటించిన సర్కారు వారి పాట వచ్చే నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందని సమాచారం అందుతోంది. అతి త్వరలో ఈ సినిమా నుంచి మరో మాస్ సాంగ్ రిలీజ్ కానుందని బోగట్టా. సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గీతా గోవిందం సక్సెస్ తర్వాత పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా దర్శకునిగా పరశురామ్ కు ఎంతో కీలకమని చెప్పవచ్చు.

మహేష్ భవిష్యత్తు ప్రాజెక్టులు త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదే ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలుకానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus