Mahesh: సినిమాల విషయంలో మహేష్ కోరికను ఏ డైరెక్టర్ తీర్చలేదా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా మహేష్ బాబు నటిస్తున్న ప్రతి సినిమా కూడా ఎంతో విభిన్నంగా ఉండడమే కాకుండా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి.మహేష్ బాబు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో కూడా నటించడానికి ఇష్టపడతారనే సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమా తర్వాత ఈయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అడ్వెంచర్స్ మూవీతో బిజీ కానున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు మహేష్ బాబు ఎన్నో విభిన్న మైనటువంటి పాత్రలలో నటించారు అయితే తనకు కెరియర్ పరంగా ఒక కోరిక ఉందని తెలిపారు. తనకు హీరో నాగార్జున మాదిరిగా భక్తి పాత్రలలో నటించాలని ఉంది అంటూ ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఇప్పటివరకు తనకు ఇలాంటి కథ ఒకటి కూడా రాలేదని వస్తే నటించాలని ఉంది అంటూ మహేష్ బాబు చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే మహేష్ బాబుకు (Mahesh) ఇలాంటి కథలు సెట్ అవ్వవు అన్న ఉద్దేశంతోనే ఇప్పటివరకు దర్శక నిర్మాతలు ఎవరు కూడా ఇలాంటి కథతో మహేష్ బాబు వద్దకు వెళ్లలేదని చెప్పాలి.ఇలా మహేష్ బాబుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అయ్యో మహేష్ బాబు కోరిక తీర్చే డైరెక్టర్స్ ఇండస్ట్రీలో ఎవరూ లేరా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus