Mahesh, Vikram: ఒక అభిమానిగా సినిమా చూసి గొప్పగా ఫీలయ్యా!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విక్రమ్. ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. గత నెల మూడవ తేదీ విడుదలైనది సినిమా ఏకంగా 400 కోట్లను రాబట్టి రికార్డు సృష్టించింది. థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాపై ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు.

తాజాగా ఈ సినిమా చూసిన ఆయన సినిమా గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మహేష్ విక్రమ్ సినిమాపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్, ఇండస్ట్రీ హిట్ గా మహేష్ వర్ణించారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టాలెంట్ అమేజింగ్ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.ఈ సినిమా గురించి డైరెక్టర్ ను అడిగి తెలుసుకున్నాను చాలా అద్భుతం అనిపించింది అంటూ మహేష్ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమాలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటనపై ప్రశంసలు అందించారు.

ఇక చివరిగా కమల్ హాసన్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ… లెజెండ్ కమల్ హాసన్ గారి నటన ఎంతో అద్భుతం ఆయన నటన గురించి చెప్పే అర్హత నాకు లేదు. నేను ఒక సాధారణ అభిమానిగా విక్రమ్ సినిమా చూసి ఎంతో గొప్పగా ఫీలయ్యాను. కమల్ హాసన్ సార్ గారికి కంగ్రాట్స్ అంటూ మహేష్ బాబు విక్రమ్ సినిమా పై సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

ప్రస్తుతం మహేష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విక్రమ్ సినిమా విడుదలయి దాదాపు నెలరోజులు అవుతున్న ఈ సినిమాకి ఇప్పటికీ ఏమాత్రం ఆదరణ తగ్గలేదు.ఇకపోతే మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కానున్నారు. ఈ సినిమా వచ్చే నెల నుంచి షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus