“దూకుడు” సినిమాలో ఓ 10 నిమిషాలు సాధారణ ఎమ్మెల్యేగా మహేష్ బాబును వైట్ అండ్ వైట్ కాటన్ బట్టల్లో చూస్తేనే ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అలాంటిది అదే మహేష్ బాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనిపిస్తే వారి సంతోషం కట్టలు తెంచుకోకుండా ఉంటుందంటారా?. అతీత్వరలో “భారత్ అనే నేను” సినిమా చూసే అభిమానులు ఆ పట్టరాని ఆనందానికి లోనవ్వాల్సిందే అంటున్నారు సదరు సినిమా టీం.
ఇటీవలే “ముఖ్యమంత్రి క్యాబిన్” సెట్ వేసి మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ఎంట్రీ ఇచ్చే సీన్స్ కొన్ని తీశారట. ఔట్ పుట్ అదిరిపోయిందని, డీసెంట్ చీఫ్ మినిస్టర్ గా మహేష్ బాబు మహాబాగున్నాడని టాక్. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనుకొన్నప్పటికీ.. కారణాంతరాల వలన సంక్రాంతి బరి నుండి తమ సినిమాని తప్పించాల్సి వచ్చింది. మరి మహేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూసుకొనే మహాద్భాగ్యం అభిమానులకు ఎప్పుడు కలిగేనో వేచి చూడాల్సిందే.