SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

మహేష్ బాబు- రాజమౌళి..ల కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ ఈవెంట్ ఈరోజు అనగా నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఏ పాత్ర పోషిస్తున్నారు? ఎలా కనిపించబోతున్నారు? రాజమౌళి మహేష్ స్టామినాని ప్రపంచానికి ఎలా చాటనున్నారు? వంటి అనేక ప్రశ్నలు చాలా మంది ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇప్పటికే విలన్ కుంభగా చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ బయటకు వచ్చింది.

Mahesh Babu

అలాగే మందాకిని పాత్ర పోషిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా లుక్ కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా అంతా అవి ఏ రేంజ్లో సందడి చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘సంచారి’ అంటూ విడుదల చేసిన గ్లొబ్ ట్రోటర్ టాపిక్ సాంగ్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. గ్లొబ్ ట్రోటర్ ఈవెంట్లో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్..మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఒక 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ చూస్తూ అలా ఉండిపోయాను.మహేష్ బాబు తాలూకు విశ్వరూపం చూస్తే అది మరిచిపోలేని జ్ఞాపకంగా ఉండిపోతుంది.డబ్బింగ్ లేదు, CG లేదు, BGM లేదు.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కి ఆ మ్యాజిక్ రాజమౌళి తీయడం వల్ల వచ్చిందా? నేను(విజయేంద్రప్రసాద్), దేవాకట్టా, కాంచి రాయడం వల్ల వచ్చిందా? అనేది అర్ధం కావడం లేదు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు తీస్తారు. కానీ కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు.ఇది హనుమ కారణంగానే సాధ్యమైంది అనుకుంటున్నాను. ఆయన కూడా రామ నామమే స్మరించుకుంటాడు కదా” అంటూ చెప్పుకొచ్చారు. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ తో మహేష్ బాబు అభిమానులు ఉప్పొంగిపోతున్నారు అనే చెప్పాలి.

 

‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus