Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబునే నెంబర్ 1 హీరోనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలువురు హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇకపోతే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు కేవలం తెలుగుభాషా సినిమాలో మాత్రమే చేస్తున్నారు. ఈయన చేసినటువంటి సినిమాలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈ విధంగా ఈ హీరోలందరూ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు విడుదల చేస్తుంటే మహేష్ బాబు సినిమాలు మాత్రం కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమతిమవుతున్నాయి.

ఇక పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న హీరోలందరూ కూడా ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అం డుకుంటున్నారు. ఇక మహేష్ బాబు కూడా ఒక్కో సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో కాకుండా రెండు రాష్ట్రాలలో మాత్రమే విడుదలవుతుంది అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. ఇలా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసే హీరోలు 100 కోట్లు తీసుకుంటూ ఉండగా మహేష్ బాబు (Mahesh Babu) మాత్రం పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఇలా రెమ్యూనరేషన్ విషయంలో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారంటూ నివేదికలు తెలుపుతున్నాయి.మహేష్ బాబు సినిమాలు రెండు రాష్ట్రాలకే పరిమితమైన రెమ్యూనరేషన్ మాత్రం భారీగా ఉందని తెలుస్తుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus