సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా హిట్ అయితే ఎంత సంతోషపడతారో.. ఫెయిల్ అయితే అంతకంటే ఎక్కువగా బాధపడతారు. కొన్ని రోజులు పాటు ఇంట్లోనే ఉండిపోతారు. జనాల్లోకి రారు. బ్రహ్మోత్సవం తర్వాత ఎంతో హోప్స్ పెట్టుకున్న స్పైడర్ కూడా విజయాన్ని అందించలేకపోయింది. ఈ షాక్ తో నెలరోజుల పాటు బయటికి రారని అందరూ అనుకున్నారు. డైరక్టర్ కొరటాల శివ అయితే భయపడ్డారు. కానీ మహేష్ ఆపని చేయలేదు. స్పైడర్ రిలీజ్ అనంతరం భార్య, పిల్లల్తో కలిసి విదేశీ టూర్ కి వెళ్లిన మహేష్ షెడ్యూల్ ప్రకారం ఆదివారం హైదరాబాద్ కి వచ్చారు.
సోమవారం నుంచి భరత్ అనే నేను సినిమా కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టారు. ఉత్సాహంతో షూటింగ్ లో మహేష్ పాల్గొనడం యూనిట్ సభ్యులను సంతోషపెట్టింది. ముఖ్యమంత్రిగా మహేష్ కనిపించనున్న ఇందులో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ (ధోనీ ఫేమ్) హీరోయిన్ గా నటిస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న రెండో మూవీ కావడంతో భరత్ అనే నేనుపై భారీ అంచనాలు ఉన్నాయి.