Mahesh Babu: ఫ్యామిలీతో ఉన్న క్యూట్ ఫోటోని షేర్ చేసిన మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎక్కుతున్న గుంటూరు కారం సినిమా పనులలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా జనవరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

పోస్టులో భాగంగా ప్రతిక్షణం వారితో ఆస్వాదించడానికి తాను ఇష్టపడతాను అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు పోస్ట్ చేశారు. మరి ఈయనకు ఎవరితో గడపడం ఇష్టం అనే విషయానికి వస్తే మహేష్ బాబుకి అత్యంత ఇష్టమైనటువంటి వారు మరెవరు ఉంటారు తన ఫ్యామిలీ తప్పా. ఈయన ఎంత సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పాలి

ఇక సినిమా షూటింగ్ పనులలో ఏమాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళుతూ ఉంటారు. ఇలా తన కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మహేష్ బాబు ప్రతిక్షణం తన కుటుంబ సభ్యులతో గడపడం అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు. గతంలో ఈయన తన ఫ్యామిలీతో కలిసి పారిస్ వెళ్ళిన సంగతి తెలిసిందే

అక్కడ తన (Mahesh Babu) ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి కూర్చొని ఉన్నటువంటి ఒక ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసిన మహేష్ బాబు త్రో బ్యాక్ పిక్ అంటూ నా ఫేవరెట్ పీపుల్ తో ప్రేమదేశం పారిస్ లో ప్రతిక్షణం ఆస్వాదించాను అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus