Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ లుక్ విషయంలో సంతోషంగా అభిమానులు.. కానీ?

  • July 15, 2024 / 01:33 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  సినీ కెరీర్ లో ఎన్నో బాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. గత కొన్నేళ్ల నుంచి మహేష్ బాబు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. మహేష్ బాబు తాజాగా అనంత్ అంబానీ పెళ్లికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. పెళ్లిలో మహేష్ బాబు మీడియాకు ఫోజులు ఇవ్వగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ను చూసిన అభిమానులు ఆ లుక్ కు ఫిదా అవుతున్నారు.

లాంగ్ హెయిర్, గడ్డం, మీసంతో మహేష్ బాబు గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ బాబు గతంలో ఎప్పుడూ కనిపించని మేకోవర్ లో కనిపించడం ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగిస్తుండటం గమనార్హం. కండలు పెంచి మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న లుక్ ఫైనల్ లుక్ కాదని మహేష్ జుట్టు మరింత పెంచి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే లుక్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా అదిరిపోయే క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. మహేష్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా లుక్స్ ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ను అందుకోనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు పారితోషికం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.

మహేష్ బాబు సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందని భోగట్టా. మహేష్ రాజమౌళి కాంబో మూవీ కోసం 2027 వరకు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబో మూవీ విదేశీ భాషల్లో సైతం విడుదల కానుందని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus