Mahesh Babu: అలా ఉండటం మహేష్ కు మాత్రమే సాధ్యమా?

సాధారణంగా హీరోలకు, హీరోయిన్లకు వయస్సు పెరిగితే ముఖంలో కచ్చితంగా మార్పులు వస్తాయి. అయితే ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం వయస్సు పెరిగే కొద్దీ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తూ అభిమానులు సైతం షాకయ్యేలా ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరకు మహేష్ బాబు కొత్త లుక్ ను ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా మహేష్ బాబు కొత్త లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా మహేష్ లుక్ ను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

కొంచెం గడ్డం, పెరిగిన జులుపాలతో మహేష్ బాబు మరింత అందంగా కనిపిస్తున్నారు. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. టాలీవుడ్ అందగాడిగా పేరు తెచ్చుకున్న మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం భారీ స్థాయిలో పెరుగుతోంది. ఆర్థిక నేరాలకు సంబంధించిన కథాంశంతో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కనుండగా సినిమాలో యాక్షన్ సీన్లతో పాటు ఎంటర్టైన్మెంట్ కు కూడా ప్రాధాన్యత బాగానే ఉంటుందని సమాచారం.

జగపతిబాబు, సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారని వార్తలు వస్తుండగా మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. మహేష్ బాబుకు ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ అనేలా మాత్రమే ఉందని మహేష్ ఇప్పటికీ కాలేజ్ బాయ్ లా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పదేళ్ల వరకు మహేష్ కు హ్యాండ్సమ్ గా కనిపించే విషయంలో పోటీనిచ్చే హీరో రాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus