Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ అప్డేట్

  • August 17, 2024 / 08:00 AM IST

”ముఫాసా’ కోసం మహేష్ బాబు (Mahesh Babu)’.. ఈ టైటిల్ చూడగానే అందరి మైండ్లో ఎన్నో రకాల ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా కొరకు రెడీ అవుతున్నాడు. రాజమౌళితో ఏ సినిమా కమిట్ అయిన ఏ హీరో కూడా… మరో సినిమా చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. రాజమౌళి.. హీరోని లాక్ చేసే విధానం అలా ఉంటుంది. మరి ‘ముఫాసా’ వంటి పెద్ద సినిమా విషయంలో మహేష్ బాబు పేరు వినిపించడం ఏంటి? అనే డౌట్ అందరి మైండ్లో మెదలొచ్చు.

Mahesh Babu

కరెక్టే.. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాడు. అతను ఎక్కడికి వెళ్లాలన్నా రాజమౌళి పర్మిషన్ తీసుకుని కానీ.. వేరే చోటికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే మరో సినిమాలో నటించడానికి కూడా ఛాన్స్ లేదు. అయితే ‘ముఫాసా : ది లయన్ కింగ్’ కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పనున్నాడట. అవును.. ‘ముఫాసా : ది లయన్ కింగ్’ డిసెంబర్ 20 న విడుదల కాబోతోంది.

అందులో ముఫాసా యంగ్ రోల్ కోసం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పబోతున్నారు అని సమాచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక మహేష్ బాబు.. వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో ‘జల్సా’ (Jalsa) ‘బాద్ షా’ (Baadshah) ‘ఆచార్య’ (Acharya) వంటి సినిమాల కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాక్స్ పేయర్లకి ఈ దేశంలో ఏమీ చేయలేమా.. కొరటాల కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus