సర్కారు వారి పాట.. అసలు లుక్కు ఇదన్నమాట!

సూపర్ స్టార్ అభిమానులకు ఈ ఏడాది చాలా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సూపర్ స్టార్ 2021ను కరోనా వల్ల మిస్ చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే ఈ పాటికె రేంజు ప్రాజెక్టులు వచ్చి ఉండేవి. ఇక మొత్తానికి సర్కారు వారి పాట కోసం మరో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు మహేష్.

చాలా వరకు మహేష్ లుక్ విషయంలో పెద్దగా రిస్క్ చేయడు. అయితే సర్కారు వారి పాట కోసం మాత్రం స్టైల్ ను మార్చాలని అనుకున్నాడట. ఇటీవల షూటింగ్ స్పాట్ లో తీసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ హెయిర్ స్టైల్ తో పాటు బాడీ ఫిట్నెస్ లో కూడా మార్పులు చేసినట్లు అర్ధమవుతోంది. చూస్తుంటే పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మహేష్ సర్కారు వారి పాట కొత్త లుక్ మాత్రం సినిమాపై అంచనాల డోస్ ను మరింత పెంచేసేంది.

ఇక సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ లో దుబాయ్ లో ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. మహేష్ ఫ్యామికి మొత్తం దుబాయ్ కు వెళ్లారు. ఇక రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటూనే మహేష్ తన ఫ్యామిలీతో కూడా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ముఖ్యంగా కూతురు సీతారతోనే మహేష్ ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక సర్కారు వారి పాట సినిమాను 2022 సంక్రాంతికు విడుదల చేయాలని నిర్మాతలు డేట్ ను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.


Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus