గతేడాది సమ్మర్ కానుకగా విడుదలైన ‘మహర్షి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. అశ్వినీ దత్, దిల్ రాజు, పివిపి .. వంటి బడా నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదట ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ.. ఆ తరువాత సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 95కోట్ల కు అమ్మగా.. 101 కోట్ల షేర్ వరకూ కలెక్ట్ చేసింది.
ఇక ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కొన్న అమెజాన్ వారికి కూడా లాభాలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కొన్న జెమినీ వారికి మాత్రం మొదట పెద్ద షాక్ తగిలింది. ‘మహర్షి’ ని వారు మొదటి సారి టెలికాస్ట్ చెయ్యగా.. కేవలం 9.3 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది. దాంతో వారికి నష్టాలు తప్పవేమో అని అంతా అనుకున్నారు. కానీ రెండో సారి టెలికాస్ట్ చేసినప్పుడు 7.3, మూడవ సారి 6.13, నాలుగో సారి 9.02 టి.ఆర్.పి రేటింగ్ లను నమోదు చేసి వారిని లాభాల్లోకి నెట్టి ఊపిరి పీల్చుకునేలా చేసింది.
ఇక ఐదవ సారి టెలికాస్ట్ చేసినప్పుడు 8.96 అలాగే 6 వ సారి టెలికాస్ట్ చేసినప్పుడు 7.5 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసి.. బుల్లితెర పై కూడా సూపర్ హిట్ అయ్యిందనే చెప్పాలి. ఇక మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని కూడా జెమినీ వారే టెలికాస్ట్ చెయ్యగా.. మొదటి సారే వారు లాభాలు బాట పట్టారు. ఆ చిత్రం ఏకంగా 23.3 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసి సెన్సేషనల్ రికార్డు ని క్రియేట్ చేసింది.