Mahesh Babu, Majula: సోదరి మంజులతో మహేష్ బాబు మాస్టర్ ప్లాన్!

మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నడూ లేనంత మంచి ఫామ్ లో ప్రస్తుతం ఉన్నారు. అంతకముందు సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన మహేష్, కొన్నాళ్ల క్రితం భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ తో బ్యాక్ తో బ్యాక్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ మహేష్ కి జోడీగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం గోవా లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన బ్లాస్టర్ టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుని సినిమా పై భారీ అంచనాలు రేకెత్తించింది. ఈ మూవీ ని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. దీని తరువాత త్రివిక్రమ్ తో ఒక మూవీ తో పాటు ఆపై రాజమౌళి తో మరొక మూవీ చేయనున్నారు మహేష్. అయితే లేటెస్ట్ గా పలు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ఏంటంటే, ఈ సినిమాల తరువాత తన సోదరి మంజుల సొంత సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ ఒక సినిమా చేయనున్నారట.

ఇప్పటికే పలువురు దర్శకుల నుండి కథలు వింటున్న మంజుల రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ దర్శకుడి స్టోరీ ని ఓకే చేసారని వినికిడి. త్వరలో పూర్తి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించి అది పూర్తి అయిన అనంతరం మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయనున్నారట. గతంలో మహేష్ తో మంజుల తీసిన నాని మూవీ ఫ్లాప్ కాగా, పూరితో కలిసి ఆమె నిర్మించిన పోకిరి సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మరింత భారీ స్థాయిలో మహేష్ తో ఆమె మూవీ నిర్మించనున్నారని, తన కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చేలా ఆమె ఈ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు …..!!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus