నాగ చైతన్య, సమంత ల ప్రేమ కహానీకి మహేష్ కు లింక్ ఏంటి?

‘అద్బుతం జరిగే ముందు ఎవ్వరూ ఊహించలేరు.. అద్బుతం జరిగాక ఆశ్చర్యం తప్ప ఊహలు ఉండవు’… ఈ విషయాలు సూపర్ స్టార్ కృష్ణగారు అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే ఈయన కొడుకు మహేష్ బాబు వల్ల ఓ అద్బుతం జరిగింది. అదే నాగ చైతన్య, సమంత ల మధ్య ప్రేమ పుట్టడం. అదెలా అంటారా…! అది తెలుసుకోవాలి అంటే మనం కాస్త వెనక్కి వెళ్ళక తప్పదు. అవి ‘ఒక్కడు’ సినిమా రోజులు. తన అక్క మంజుల నిర్మాణంలో 3 సినిమాలు చేస్తాను అని మహేష్ బాబు చెప్పాడట.అతని ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక ‘నాని’ సినిమా చేసి పెట్టాడు. అది ఆడలేదు. దానికి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు మహేష్. ఫలితంగా ‘పోకిరి’ సినిమా చేసి పెట్టాడు.

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే.. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. అయితే ‘పోకిరి’ సినిమా విడుదలయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మహేష్ బాబు ఇమేజ్ ను కంప్లీట్ గా మార్చేసింది ఆ చిత్రం.నిజానికి ‘పోకిరి’ సినిమాకి కూడా మహేష్ మొదట ఎటువంటి అడ్వాన్స్ తీసుకోలేదట. లాభాల్లో వాటా ఇవ్వమని నిర్మాతలు ఆయిన తన అక్క మంజుల మరియు పూరి జగన్నాథ్ లకు చెప్పాడట. అయితే ‘పోకిరి’ తో తన ఇమేజ్ మొత్తం మారిపోయింది. దాంతో గౌతమ్ మీనన్ తో ఈ లవ్ స్టోరీ చెయ్యలేను.. కుదిరితే మంచి యాక్షన్ సినిమా చేద్దాం అని చెప్పాడట. ఇక మంజుల కూడా మహేష్ ను ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు సీన్ లోకి చైతన్య , సమంత లు వచ్చారు.

వాళ్ళ మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ‘ఏమాయ చేసావే’. అయితే ఇక్కడితో అయిపోలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ ‘మనం’ సినిమా కథని మొదట మహేష్ కు చెప్పాడట. కానీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడం వల్ల దానిని కూడా మహేష్ రిజెక్ట్ చేసాడు. తరువాత చరణ్ కు చెబితే చరణ్ కూడా రిజెక్ట్ చేసాడు.మళ్ళీ చైతన్య , సమంత లే ఆ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ తరువాత ఇక చెప్పనవసరం లేదు కదా. వారి మధ్య ప్రేమ బలపడింది. అది పెళ్ళి వరకూ వెళ్లింది. అద్బుతం అంటే ఇదేనేమో.. మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాల వల్ల చైసామ్ లు ఒక్కటయ్యారు.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus