Sitara: సితార కెరియర్ పట్ల భారీ ప్లాన్స్ వేస్తున్న మహేష్ నమ్రత!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వారసురాలిగా సితార అందరికీ ఎంతో సుపరిచితమే. ఇంత చిన్న వయసులోనే సితార తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికే పలు యాడ్స్ చేయడానికి అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఇంత చిన్న వయసులోనే సితారకు స్టార్ సెలబ్రెటీ హోదా లభించింది అని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది తమ పిల్లలను వారసులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే సితార కెరియర్ పరంగా కూడా మహేష్ నమ్రత భారీగానే ప్లాన్స్ వేసారని దీంతో ఈమె కెరియర్ పై ఇప్పటినుంచే ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది. హీరోయిన్ అయిన తర్వాత మంచి సక్సెస్ అందుకోవడం కోసం మహేష్ బాబు ఇప్పటినుంచి తనని ప్రేక్షకులకు చేరువ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే సితార ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అలాగే షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, పలు యాడ్స్ కి ప్రమోటర్ గా వ్యవహరించడానికి తనని ఎంకరేజ్ చేస్తున్నారు.

ఇప్పటినుంచి సితార ప్రేక్షకులకు చేరువ అయితే తాను హీరోయిన్ అయిన తర్వాత తన కెరియర్ బాగుంటుందన్న ఆలోచనలోనే మహేష్ నమ్రత సితారను ఉన్నఫలంగా హైలెట్ చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు విషయంలో కూడా తన తండ్రి కృష్ణ ఇదే ఫార్ములా ఉపయోగించారట మహేష్ బాబుని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ముందు తనని ప్రేక్షకులకు బాగా దగ్గర చేశారని అనంతరం ఈయనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారని తెలుస్తోంది.

ఇలా తన విషయంలో తన తండ్రి ఉపయోగించిన స్ట్రాటజీని ఇప్పుడు మహేష్ బాబు కూడా తన కూతురి విషయంలో చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా మహేష్ నమ్రత తీరు చూస్తుంటే అతి త్వరలోనే సితార (Sitara) మనకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది అనడంలో సందేహం లేదు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus