మహేష్ కొత్త కార్-వ్యాన్ ఇన్సైడ్ పిక్స్ వైరల్..!

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్వాంకీ వ్యానిటీ వ్యాన్‌ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా మహేష్ కు ఓ కార్ వ్యాన్ ఉండేదని వినికిడి. అయితే ఇటీవల తన అభిరుచికి తగినట్టు ఓ వ్యానిటీ వ్యాన్‌ను డిజైన్ చేయించుకున్నాడు. దీని కోసం కోసం రూ.6 కోట్ల పైనే ఖర్చు పెట్టాడని అతని సన్నిహిత వర్గాల సమాచారం. పూణేకు చెందిన ఆటోమొబైల్ డిజైనింగ్ సంస్థ.. మహేష్ వ్యానిటీ వ్యాన్ ఇంటీరియర్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.

హోం థియేటర్‌తో పాటు అన్ని రకాల సదుపాయాలు ఇందులో ఉన్నాయి.ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మహేష్ ఓ యాడ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తమన్నా కూడా యాడ్ లో నటించింది.ఆ యాడ్‌ కోసం మహేష్ ఈ వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించాడు. ఆ టైములో తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ కు 9 నెంబర్ సెంటిమెంట్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ వ్యానిటీ వ్యాన్ నెంబర్ కూడా 4005 తో రిజిస్టర్ చేయించాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు మహేష్. మొదటి షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి మహేష్ రెడీ అవుతున్నాడు.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus