కోర మీసం…పంచ కట్టు మహేష్ కేక

మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని ఈ గెటప్ లో ఎప్పుడూ చూసి ఉండరు. కోరమీసం, తెల్ల చొక్కా, పంచె మరియు పెద్దరికం తలపించేలా భుజం పై కండుగా సరికొత్తగా దర్శనం ఇచ్చారు మహేష్. ఐతే మహేష్ ఈ కొత్త గెటప్ ఏదో సినిమా కోసం కాదులెండి.. కేవలం ఓ యాడ్ కోసం. ఆన్లైన్ కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ ప్రచార కర్తగా ఉన్న మహేష్ కొత్త యాడ్ షూట్ కోసంనయా లుక్ ట్రై చేశారు. మహేష్ కి ఆ కొత్త గెటప్ అద్భుతంగా ఉంది.

అదే వీడియోలో మహేష్ మరో లుక్ లో కనిపించగా చాలా గ్లామర్ గా ఉన్నారు. మహేష్ గ్లామర్ కి ఎక్సపైరీ లేదంటే నమ్మాల్సిందే. మరో పదేళ్ల తరువాత మహేష్ ఇలాగే కాలేజ్ కుర్రాడి లుక్ మైంటైన్ చేస్తాడనిపిస్తుంది. లాక్ డౌన్ సమయంలో మహేష్ కొన్ని వ్యాపారాల ప్రకటనల వీడియో షూట్స్ లో పాల్గొన్నారు. మరో వైపు తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది.

Mahesh Babu new look shocks everyone1

బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక నేరాలు ప్రధానాంశంగా తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ పాత్ర సరికొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి విశేష స్పందన దక్కింది. కీర్తి సురేష్ ని ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus