టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. మైథాలజీ టచ్ చేస్తూ ఓ అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు చిత్ర బృందం.
మరోపక్క 3వ షెడ్యూల్ కు కూడా రంగం సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకి పాన్ వరల్డ్ రేంజ్లో మార్కెట్ ఏర్పడటం ఖాయం. అతను కూడా వెయ్యి కోట్ల హీరో అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం కర్చీఫ్ వేసుకోవడానికి రెడీ అయ్యారు కొందరు దర్శకులు. ఈ రేసులో ఆల్రెడీ కొరటాల శివ (Koratala Siva) ఉన్నాడు. మహేష్ కి (Mahesh Babu) కొరటాల అంటే మంచి గౌరవం ఉంది.
అలాగే మరో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా మహేష్ తో నెక్స్ట్ సినిమా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ ఓ స్పోర్ట్స్ డ్రామా కథ.. మహేష్ కి అనిల్ వినిపించడం.. దానికి మహేష్ ఓకే చెప్పడం జరిగింది. ఇప్పుడు మరో ఇద్దరు టాప్ డైరెక్టర్లు మహేష్ కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్లలో ఒకరు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) తో నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు మహేష్ కోసం అతను ఓ హాలీవుడ్ స్టైల్ యాక్షన్ డ్రామా కథ రెడీ చేస్తున్నాడట.
త్వరలోనే మహేష్ ను కలిసి కథ వినిపించాలని అతను భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క చరణ్ తో (Ram Charan) ‘పెద్ది’ (Peddi) అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్న బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కూడా మహేష్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఇది ఒక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తుంది. మహేష్ చేతిలో ‘మైత్రి’ వారి అడ్వాన్స్ ఉంది. బుచ్చిబాబు కథ ఓకే అయితే.. మైత్రిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.