పాత సినిమాలను మళ్లీ ఫ్రెష్ గా రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘పోకిరి’ని రీరిలీజ్ చేశారు ఫ్యాన్స్. అప్పటినుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ‘జల్సా’, ‘తమ్ముడు’ లాంటి సినిమాలను రీరిలీజ్ చేశారు. మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా రూ.1.5 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాను 4కెలో రిలీజ్ చేస్తే ఏకంగా రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఎన్ని షోలు వేస్తే అన్నీ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ బిజినెస్ బాగుందని భావించిన ఇండస్ట్రీ వాళ్లు.. వరుసగా పాత సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘బిల్లా’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పవన్ సాధించిన రికార్డుని బద్దలు కొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి మహేష్ బాబు నుంచి పాత సినిమా ఒకటి రాబోతుంది.
2023 జనవరి 8 నాటికి ‘ఒక్కడు’ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘ఒక్కడు’ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. జనవరి 8న ఈ సినిమా ప్రపంచవ్యాఓతంగా ఎంపిక చేసిన సెంటర్స్ లో ప్రదర్శించనున్నారు. సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాల హడావిడి ఉంటుంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు స్లాట్స్ బుక్ చేసుకున్నాయి.
అయినప్పటికీ ‘ఒక్కడు’ సినిమా వెనుకడుగు వేయడం లేదు. సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. జనవరి 8నాటికి కొత్త సినిమాలేవీ రిలీజ్ కావని.. కాబట్టి ‘ఒక్కడు’ సినిమాకి టికెట్లు తెగ ఛాన్స్ ఉందని ప్లాన్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!