టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మహేష్ బాబు మరోవైపు వ్యాపారాలపై దృష్టి పెడుతూ బిజినెస్ లో కూడా సత్తా చాటడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాలు చేస్తున్న మహేష్ ఆన్ లైన్ విద్యా బోధన కొరకు తెలుగులో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని బోగట్టా.
ఒక మల్టీ నేషనల్ కంపెనీతో మహేష్ యాప్ కు సంబంధించి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాపారం కొరకు మహేష్ ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనున్నారని సమాచారం. త్వరలోనే మహేష్ కొత్త బిజినెస్ గురించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జేఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన సర్కారు వారి పాట పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా 2022 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!