టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ పర్సన్. ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కో వ్యక్తిలో ఒక్కో గొప్ప లక్షణం పుట్టుకొస్తూ ఉంటుంది. మహేష్ నుండి కూడా కొన్ని విషయాలు అందరూ నేర్చుకోవచ్చు. అదేంటి అంటే.. గతంలో మహేష్ బాబు సిగరెట్లు విపరీతంగా కాల్చేవారు. తన ప్రతి సినిమాలో సిగరెట్లు కాల్చే షాట్లు ఉండేవి. తన కొడుకు గౌతమ్ కోసం .. సిగరెట్లు మానేయాలి అనుకున్నాడు. అందుకోసం స్నేహితుడు పంపించిన ఓ పుస్తకం చదివి..
ఆ అలవాటుకు దూరమయ్యారు. తన సినిమాల్లో కూడా స్మోకింగ్ ఎపిసోడ్స్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. కానీ ‘గుంటూరు కారం’ సినిమా కోసం ఆయన స్మోకింగ్ చేస్తున్నట్లు కొన్ని సన్నివేశాలు చేయాల్సి వచ్చింది. అయితే అది షూటింగ్లో భాగంగా మాత్రమే. ఆ పాత్ర డిమాండ్ చేయడం వల్లనే. అది పక్కన పెడితే.. మహేష్ ఓ అలవాటు మాత్రం అస్సలు మనుకోలేకపోతున్నారట. అదేంటి అంటే పేకాట ఆడటం.
అవును (Mahesh) మహేష్ కి పేకాట ఆడటం అంటే బాగా ఇష్టం. అతను ఏ ఈవెంట్ కి వెళ్లినా.. తన స్నేహితులతో కలిసి పేకాడటాన్ని ఎంజాయ్ చేస్తారట. మహేష్ అనే కాదు పెళ్లి వేడుకల్లో భాగంగా చాలా మంది కార్డ్స్ ఆడటం అనేది ఎంజాయిమెంట్ గా భావిస్తారు. మహేష్ కి కూడా ఆ అలవాటు ఉంది. ఇటీవల మహేష్.. మరో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తో కలిసి పేకాడుతున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.