Mahesh Babu: రాజమౌళి సినిమా కోసం మరోసారి ‘సూపర్‌ స్టార్స్‌’ ప్రయత్నం… నిజమేనా?

  • March 13, 2024 / 09:49 AM IST

ఒక్క మహేష్‌బాబును (Mahesh Babu)  రాజమౌళి  (SS Rajamouli) ఫ్రేమ్‌లో వెండితెరపై చూస్తే చాలు.. అదే పదివేలు అనుకుంటున్నారు అభిమానులు. ఎందుకంటే ఆయన హీరోలను చూపించే విధానం, తద్వారా వాళ్లకు వచ్చే పాన్‌ ఇండియా ఇమేజ్‌ అలాంటివి మరి. అలాంటిది సినిమాలో ఇద్దరు మహేష్‌బాబులు ఉంటే… (ఇద్దరు అంటే డ్యూయల్‌ రోల్‌ అని మీకు అర్థమయ్యే ఉంటుంది) ఇంకా అదిరిపోతుంది అని చెప్పాలి. ఇప్పుడు ఈ అదిరిపోయే ప్లానే రాజమౌళి వేస్తున్నారు అని టాలీవుడ్‌ లేటెస్ట్‌ టాక్‌. #ssmb29లో మహేష్‌ డ్యూయల్‌ రోల్‌ అంటున్నారు.

మహేశ్‌ – రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ విషయంలో టీమ్‌ నుండి అధికారిక ప్రకటన లేకపోయినా… పుకార్లు అయితే బలంగా వస్తున్నాయి. దీనికి అభిమానుల నుండి మంచి స్పందన కూడా వస్తోంది కారణం ఒకే సినిమాలో రెండు పాత్రలు మహేశ్‌ ఇప్పటివరకూ చేయలేదు. బాలనటుడిగా ‘కొడుకు దిద్దినకాపురం’ చేశారు.

మరోవైపు రాజమౌళి (Baahubali) ‘బాహుబలి’, (Vikramarkudu) ‘విక్రమార్కుడు’ సినిమాల్లో హీరోలతో డ్యూయల్‌ రోల్‌ చేయించి హిట్‌ కొట్టారు. దీంతో మహేష్‌కు కూడా ఆ హిట్‌ ఫార్ములా కావాలని అనుకుంటున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించి కీలక పాత్రధారుల కోసం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటికే ఒకరిద్దరు ముఖ్య నటులను సంప్రదించారట. ఇక సినిమాలో మహేశ్‌ కోసం లుక్‌ టెస్ట్‌ జరిగిందంటున్నారు. అందులో ఓ మూడు లుక్‌లు ఫైనలైజ్‌ చేశారట.

మొత్తం ఎనిమిది లుక్స్‌లో కథకు, మహేశ్‌ ఆహార్యానికి సరిపోయేలా ఆ మూడు లుక్స్‌ ఉన్నాయి అంటున్నారు. మరోవైపు మహేష్‌ ఆ సినిమా సెట్స్‌లోకి వెళ్లాక యాడ్‌లు చేయడం కుదరకపోవచ్చని అందుకే ఈలోపు యాడ్‌ షూటింగ్‌లు పూర్తి చేసేస్తారని అంటున్నారు. అదే జరిగితే మహేష్‌ బయట కనిపించడం పూర్తిగా తగ్గిపోతుంది. మొత్తం గ్రీన్‌ మ్యాట్, బ్లూ మ్యాట్‌ మీదే షూటింగ్‌ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus