Mahesh Babu: వెకేషన్ మూడ్ లో చిల్ అవుతున్న మహేష్!

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఇటీవల నటించిన సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. షూటింగ్ లేని సమయంలో మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి తరచూ విదేశాలకు చెక్కేస్తూ ఉంటాడు. తాజాగా మహేశ్ బాబు తన భార్య, పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. వీరి వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా మహేశ్ బాబు సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు. అప్పుడప్పుడు తన సినిమాలకి సంబంధించిన విషయాలు మాత్రమే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. ఇక మహేశ్ భార్య నమ్రత అన్ని విషయాలలో మహేశ్ కి చేదోడు వాదోడుగా ఉంటుంది. మహేశ్ కి సంబంధించిన అన్ని విషయాలు తానే దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఇక మహేశ్ బాబు కూతురు సితార మాత్రం సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది.

అతి చిన్న వయసులోనే అధిక సంఖ్యలో ఫాలోయర్స్ ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి మొదట స్విజర్లాండ్ కి వెళ్ళారు. అక్కడి నుండి ఇటలీ చేరుకొని వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ బాబు ఇటలీలో తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ఇక్కడ ఇప్పుడు.. జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నాం ..అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఫ్యామిలీ అంటే మినిమం ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ బాబు, సితార సోషల్ మీడియాలో ఏం షేర్ చేసినా కూడ కొన్ని సెకన్లలో వైరల్ గా మారుతాయి. ప్రస్తుత ఇటలీ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే మన సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసుకుని హాలిడే వెకేషన్ వెళ్లారు. ఈ వెకేషన్ పూర్తి చేసుకున్న వెంటనే మహేష్ బాబు తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus