మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈరోజుతో 21 ఏళ్ళు పూర్తయ్యింది. అతను హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ 1999 జూలై 30 న విడుదలయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ గారు తన చిన కొడుకుని దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గారి చేతుల్లో పెట్టారు. కృష్ణ గారి అబ్బాయి హీరోగా లాంచ్ అవుతున్నాడు అంటే.. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే రాఘవేంద్ర రావు గారు.. మహేష్ ను ప్రెజెంట్ చేసారు.
ఇక నిర్మాత అశ్వినీ దత్ గారు ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ చిత్రానికి 5 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టారు. మొదటిరోజు స్టార్ హీరో సినిమాని విడుదల చేసినట్టే అత్యధిక థియేటర్లలో ‘రాజకుమారుడు’ చిత్రాన్ని విడుదల చేశారు. మొదటి షో నుండీ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే ‘అంత బడ్జెట్ కొత్త హీరో పైన పెట్టారు కదా..! అది రికవర్ అవుతుందా?’ అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
వాళ్ళ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ.. ఫుల్ రన్ లో ‘రాజకుమారుడు’ చిత్రం 8 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. మొదటి రోజే ఈ చిత్రం 0.48 లక్షల షేర్ ను వసూల్ చేసింది. అప్పటి రోజుల్లో ఓ కొత్త హీరో సినిమా అంత కలెక్ట్ చెయ్యడం చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక ‘రాజకుమారుడు’ చిత్రం 37 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. అప్పటికి డెబ్యూ హీరోలలో ఇదొక రికార్డు కావడం విశేషం..!
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?