SSMB29: అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జక్కన్న?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ SSMB29పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావొస్తున్నాయి. జక్కన్న టీమ్ జనవరి 15 తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తోంది. మహేష్ కూడా ప్రాజెక్ట్ చర్చల్లో బిజీగా ఉన్నారు. వర్క్‌షాపులు నిర్వహిస్తూ, ప్రధాన పాత్రల ఎంపికక కోసం చర్చలు జరుపుతున్నారు. ఇందులో హీరోయిన్, విలన్ వంటి కీలక పాత్రలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

SSMB29

ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే దిశగా హాలీవుడ్ నటీనటులనూ ప్రాజెక్ట్‌లో చేర్చాలని రాజమౌళి ఆలోచనలో ఉన్నారు. మహేష్ సరసన ఓ హాలీవుడ్ భామను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు, మరికొన్ని రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం. జక్కన్నకు అలవాటైనట్టు, ప్రాజెక్ట్ కోసం రెండు వ్యూహాలను సిద్ధం చేశారు. రాజమౌళి ప్రణాళిక ప్రకారం జనవరి 15 నాటికి షూటింగ్ మొదలుపెట్టడం కుదిరితే చక్కగా ముందుకెళ్తుంది.

కానీ ఆ సమయానికి మహేష్ అందుబాటులో లేకుంటే, మరొక ఆప్షన్‌గా మార్చి నుంచి షూటింగ్‌ను ప్రారంభించే అవకాశముంది. ఈ విధంగా మహేష్ కు కొంత వెసులుబాటు ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం తన షెడ్యూల్‌ను మార్చి, జనవరి నాటికి పూర్తి సిద్దంగా ఉండే ప్రయత్నంలో ఉన్నారు. ఒకసారి షూటింగ్ మొదలుపెడితే రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు హీరోను పూర్తిగా ఒక జోన్ లో ఉంచుతారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ పూర్తిగా తన వెకేషన్ ప్లాన్‌లను సెటిల్ చేసి, షూటింగ్‌కు 100% డేట్లు కేటాయించాల్సి ఉంటుంది.

రాజమౌళి సినిమాలకు ఇది కామన్. ప్రొడక్షన్ పనులు ఎలా ముందుకెళ్లినా, ప్లాన్ ఎ ఫెయిల్ అయినా, ప్లాన్ బీ సిద్ధంగా ఉండటంలో జక్కన్న మాస్టర్ ప్లానర్ అనిపించుకుంటారు. మొత్తానికి SSMB29 ప్రాజెక్ట్ పనులు ఏదోలా ముందుకు సాగుతున్నాయి. ఇదే జోరుతో షూటింగ్ ప్రారంభమైతే, పాన్ వరల్డ్ స్టాండర్డ్స్‌ను అధిగమించే సినిమా రాజమౌళి – మహేష్ కాంబోలో రాబోతోందని చెప్పవచ్చు. 2026 లోనే ప్రేక్షకులను ఈ చిత్రం థ్రిల్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పుష్ప 2: హిందీ మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus