Mahesh Babu, Rajamouli: మహేష్ ను అలా చూపించబోతున్న రాజమౌళి!

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి బాహుబలి సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి వల్ల బాలీవుడ్ మీడియా సైతం టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారని తెలుస్తోంది. ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ లకు కూడా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును తెచ్చిపెట్టనున్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి మహేష్ బాబు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఈ మూవీ కోసం ఏకంగా రెండు సంవత్సరాల డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్ తో మహేష్ సినిమాను ప్లాన్ చేస్తున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదని వర్క్ జరుగుతోందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు సంబంధించి రీసెర్చ్ జరుగుతోందని యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న మహేష్ మూవీని ప్లాన్ చేశారని తెలుస్తోంది. గతంలో ఈ సినిమా కథ విషయంలో వచ్చిన రూమర్స్ నిజమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో రాజమౌళి ఎవరిని ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus