Mahesh Babu, Ram Charan: ఆ దర్శకునికి మహేష్ చెర్రీ ఓకే చెబుతారా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. మల్టీస్టారర్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. అయితే చరణ్, మహేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ దిశగా ప్రముఖ దర్శకులలో ఒకరైన వంశీ పైడిపల్లి అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబుతో మహర్షి సినిమాను, రామ్ చరణ్ తో ఎవడు సినిమాను తెరకెక్కించి తెరకెక్కించి వంశీ పైడిపల్లి విజయాలను అందుకున్నారు.

చరణ్, మహేష్ కలిసి నటిస్తే ఆ సినిమాపై మామూలుగా అంచనాలు ఉండవు. అయితే ప్రస్తుతం చరణ్, మహేష్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మల్టీస్టారర్ సినిమాలు చేయడం తనకు ఇష్టమేనని మహేష్ బాబు వెల్లడించారు. మహేష్ వెంకటేష్ తో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. మరోవైపు చరణ్ సైతం కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు.

మరోవైపు వంశీ పైడిపల్లి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో ఒకరనే సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి కోలీవుడ్ హీరో విజయ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. చరణ్ మహేష్ కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ నిర్మించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus