Mahesh Babu: వైరల్ గా మారిన మహేష్ ఓల్డ్ పిక్..!

పాత తవ్వకాల్లో విలువైన వస్తువులు దొరికినట్టు ఈ లాక్ డౌన్ టైంలో తెగ బ్రౌజింగ్ చేస్తూ కూర్చుంటున్న కొందరు నెటిజన్లు.. హీరోల పాత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఆ హీరో అభిమానులు ఆ ఫోటోలను చూసి తెగ మురిసిపోతూ వైరల్ చేసేస్తున్నారు. ఈ కోవలోనే మహేష్ బాబు పాత పిక్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు పెళ్లి రోజు కావడంతో ఆయన పెళ్లి ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

ఈ ఫొటోలో రమేష్ బాబు – మృదుల దంపతుల పక్కన మహేష్ బాబు నిలబడి యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. వైట్ కలర్ షర్ట్ ధరించి.. టక్ చేసుకొని అన్నా,వదినలతో కలిసి పోజ్ ఇచ్చాడు మహేష్ బాబు. ఇంకేముంది ఈ ఫోటోని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.అయితే ఈ ఫొటోలో మహేష్ కు .. ఇప్పటి మహేష్ కు చాలా తేడా ఉంది. అప్పట్లో కాస్త బొద్దుగా కనిపిస్తున్నాడు మహేష్. కానీ ఇప్పుడు చాలా సన్నగా ఉన్నాడు.

ఇక ఫేస్ అయితే అప్పటి కంటే యంగ్ గా కనిపిస్తుంది.ఇక ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మ‌హేష్… త్వ‌ర‌లో ప‌ర‌శురాం(బుజ్జి) డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘స‌ర్కారు వారి పాట’ చిత్రంలో నటించబోతున్నాడు. మహేష్ సరసన కీర్తి సురేష్ నటించనుంది.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus