Mahesh Babu, Rajamouli: జక్కన్న సినిమా మీద మహేష్‌ అంత నమ్మకం పెట్టుకున్నాడా?

మహేష్‌బాబు ‘యువరాజు’ సినిమా గుర్తుందా? అందులో ఓ పాటలో కృష్ణుడిలా కనిపిస్తాడు మన సూపర్‌ స్టార్‌. ఆ ఫ్రేమ్‌ చూడటానికి రెండు కళ్లూ చాలవు అనిపిస్తుంటుంది. అంతగా ఆ లుక్‌లో అదిరిపోయాడు మహేష్‌. అలాంటి మహేష్‌ రాముడిలా కనిపిస్తే, ఇంకా అదిరిపోతుంది. కదా. అయితే ఈ అవకాశం వస్తే వద్దనుకున్నాడు అనేది లేటెస్ట్‌ టాక్‌. అల్లు అరవింద్‌, మధు మంతెన కలసి నితీశ్‌ తివారి దర్శకత్వంలో బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ రూపొందించనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే రాశారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇందులో రాముడి పాత్ర కోసం మహేష్‌ను అడిగారని టాక్‌. బాలీవుడ్‌లో ‘రామాయణం’ అంటే చాలా పెద్ద ఆఫర్‌ అనే చెప్పాలి. కానీ మహేష్‌ వద్దన్నాడట. దీనికి కారణం రాజమౌళి సినిమానే అని తెలుస్తోంది. రాజమౌళి – మహేష్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా ఏళ్ల క్రితం ఓకే అయ్యింది. కె.ఎల్‌.నారాయణ నిర్మాత. అయితే ఈ సినిమా ప్రారంభం వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.

అయితే ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి – మహేష్‌ కాంబో పక్కా అంటున్నారు. మొన్నీమధ్య రాజమౌళి ట్వీట్‌లో కూడా ఈ సూచన చేశాడు. దీంతో త్రివిక్రమ్‌ సినిమా తర్వాత రాజమౌళి సినిమానే అంటున్నారు. ఈ కారణంగానే మహేష్‌… ‘రామాయణం’ వదులుకున్నాడని అంటున్నారు. రాజమౌళి సినిమా చేస్తే ఆటోమేటిక్‌గా పాన్‌ ఇండియా అయిపోతుంది. దానికి తోడు రాజమౌళి సినిమాను కాదనుకోవడం, ఇంకా ఆలస్యం చేయడం మహేష్‌కు నచ్చలేదట. అయితే రాజమౌళి ముందు చెప్పినట్లు నెక్స్ట్‌ మహేష్‌తోనే చేస్తాడా? అనేది ప్రశ్నగా మారింది.

కారణం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి ఓ చిన్న బడ్జెట్‌ బాలీవుడ్‌ మూవీ చేస్తాడని అంటున్నారు. బాలీవుడ్‌లో యువ హీరోతో ఈ సినిమా ఉంటుందని టాక్‌. మరి రాజమౌళి ఏ సినిమా చేస్తారు, మహేష్‌ ఏ సినిమా చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్‌ ‘రామాయణం’ వదులుకొని రాజమౌళి కోసం ఆగాడు, మరి రాజమౌళి బాలీవుడ్‌ సినిమా వదులకుని మహేష్‌ సినిమా చేస్తారా?

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus