టాలీవుడ్ లోకి సూపర్ స్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, తనదైన మార్క్ నటనతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అభిమానుల హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందగలిగాడు. మహేష్ తన సినిమాలతోనే కాక సోషల్ సర్వీస్ లోను తన తోటి హీరోల కంటే ఒక అడుగు ముందే ఉంటూ అందరికి ఆదర్శముగా నిలుస్తున్నాడు. అయితే ప్రస్తుతం తన కెరీర్ లోనే మొదటి సారిగా పాన్ ఇండియా మూవీ ‘వారణాసి’లో నటించబోతున్నాడు మహేష్. వాస్తవానికి ఇది పాన్ వరల్డ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
తెలుగు చలన చిత్రం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. RRR మూవీ నాటు నాటు సాంగ్ ద్వారా ఆస్కార్ వరకు వెళ్లటంతో రాజమౌళి క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ‘వారణాసి’ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీ లో హీరోగా మహేష్ బాబు ను తీసుకోవటంతో మూవీ పై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇలాంటి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ భారీగానే ఛార్జ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. సాధారణంగా ఒక్కో సినిమాకి మహేష్ బాబు 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని వినికిడి. ఈ మూవీకి మొత్తం షూటింగ్ 3 నుంచి 4 సంవత్సరాల పడుతుండగా, సంవత్సరానికి 50 కోట్ల చొప్పున 150 నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డీల్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ 2027 సమ్మర్ మార్చి లో విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.