Mahesh Babu, Renudesai: రేణుదేశాయ్ ఆ సినిమా చేసి ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో..!

  • October 19, 2023 / 08:02 PM IST

రేణు దేశాయ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పవన్ సినిమా బద్రితో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి… అదే పవన్ కళ్యాణ్ తో జానీ సినిమాతో టాటా చెప్పేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా చేసింది. కొన్నేళ్ల తర్వాత రేణు దేశాయ్ మళ్లీ మాస్ మహారాజ్ రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది.

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ కీలకపాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది. త్వరలో రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె పాల్గొంటోంది. ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని క్లాసిక్ చిత్రంగా టాలీవుడ్లో నిలిచిపోయింది.

ఇందులో వచ్చే పెళ్లి పాట ఇప్పటికీ ప్రతి పెళ్లిలోనూ ప్లే అవుతూనే ఉంటుంది. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా సోనాలి బింద్రే నటించింది. వాస్తవానికి మొదట్లో ఈ సినిమాలో నటించాలని రేణుదేశాయ్‌ని సంప్రదించారట దర్శకుడు కృష్ణవంశీ. మనసులో చేయాలని ఉన్న సినిమాలు చేయకూడదని.. రేణు దేశాయ్ అప్పటికే నిర్ణయం తీసుకుందట. ఆ కారణంగానే ఆ సినిమాకు ఆమె రిజెక్ట్ చేసిందట.

ఆ తర్వాతే కృష్ణవంశీ సోనాలి బింద్రేని తీసుకున్నారు. ఇలా (Mahesh) మహేష్ – సోనాలి బింద్రే కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా రేణు దేశాయ్ నటించి ఉంటే మరో సినిమాతో పాటు ఆమె కెరీర్ వేరే లెవెల్‌లో ఉండేది అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus