Mahesh Babu: ‘దేవకీ నందన వాసుదేవ’ కి మహేష్ రివ్యూ.. మండిపడుతున్న ఫ్యాన్స్

మహేష్ బాబు (Mahesh Babu)  తన ట్విట్టర్ ద్వారా ఇచ్చే రివ్యూలకి మంచి రెస్పెక్ట్ ఉంది ఉంటుంది.కానీ ఇప్పుడు ఉండేది అని చెప్పాలేమో. ఇది ఫ్యాన్స్ అంటున్న మాట. విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు తన సినిమా అనే కాదు..తన పోటీ హీరోల సినిమాలకి, చిన్న, మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా మహేష్ బాబు రివ్యూలు ఇస్తూ ఉంటాడు. మహేష్ రివ్యూల వల్ల బాక్సాఫీసు వద్ద నిలబడిన సినిమాలు కూడా ఉన్నాయి.

Mahesh Babu

ఇటీవల అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ (Allu Arjun) .. ‘ మహేష్ బాబు గారు జెన్యూన్ మూవీ లవర్’ అంటూ హోస్ట్ బాలకృష్ణతో (Nandamuri Balakrishna) చెప్పుకొచ్చాడు. మహేష్ రివ్యూకి తోటి హీరోలు కూడా ఎంత వాల్యూ ఇస్తారో అల్లు అర్జున్ కామెంట్లని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాంటి మహేష్ బాబు ఈరోజు ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమాకి రివ్యూ ఇచ్చాడు.

వాస్తవానికి ఆ సినిమాకి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే సడన్ గా మహేష్ బాబు ఈ సినిమాని పొగుడుతూ ట్వీట్ వేశాడు.’ ‘దేవకీ నందన వాసుదేవ’ .. అశోక్ గల్లా (Ashok Galla)’వాట్ ఎ ట్రాన్స్ఫర్ మేషన్. సో సో ప్రౌడ్’ టీం అందరికీ కంగ్రాట్స్ ‘ అంటూ ట్వీట్ వేశాడు. దీనికి స్వయంగా మహేష్ అభిమానులే ..

‘ సినిమా చూసే వేస్తావా అన్నా, లేక పెయిడ్ ప్రమోషనా ‘ అంటూ అంటూ విమర్శలు చేస్తున్నారు. గతేడాది వచ్చిన ‘ మేమ్ ఫేమస్ ‘ సినిమాకి కూడా మహేష్ ఇలా ట్వీట్ వేయడం జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. సో వీటిని బట్టి మహేష్ తన ట్విట్టర్ అకౌంట్ వాడడేమో?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus