Mahesh Babu: సుకుమార్ కూతురి సినిమాపై మహేష్ బాబు స్పందన!

సుకుమార్ (Sukumar) కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu). పద్మావతి మల్లాది (Padmavathi Malladi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుక్కు రైటింగ్స్’ ‘గోపి టాకీస్’ సంస్థల పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), రవిశంకర్ (Y .Ravi Shankar), శేషా సింధు రావ్ (Sesha Sindhu Rao)..లు కలిసి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇది ఒక ఆఫ్ బీట్ మూవీ అనే క్లారిటీ ఇచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Mahesh Babu

అయితే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో మేకర్స్ ఈ సినిమాని మీడియా వారికి స్పెషల్ ప్రీమియర్ వేసి చూపించారు. సినిమా చూసిన వాళ్ళు.. పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇక ఇండస్ట్రీ నుండి ఈ సినిమాకి మొదటి రివ్యూ ఇచ్చాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu). ‘గాంధీ తాత చెట్టు’ సినిమా వీక్షించిన వెంటనే అతను ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.” ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంతో అందరూ ట్రావెల్ అవుతారు.

అహింస అనే పదునైన థీమ్ ను దర్శకురాలు పద్మ మల్లాది ఎంతో అందంగా ప్రజెంట్ చేశారు. నా స్నేహితురాలు సుకృతి వేణి నటన చూసి చాలా గర్వపడుతున్నాను. నటిగా నీ ఎదుగుదల అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఈ లిటిల్ మాస్టర్ పీస్ ను థియేటర్లలో మిస్ అవ్వకుండా చూడండి” అంటూ రాసుకొచ్చాడు మహేష్ బాబు.

 ఈ వీకెండ్..కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus