విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి హిట్ల తర్వాత రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి… వెంకటేష్ సరసన హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా రమణ గోగుల పాడిన.. ‘గోదారి గట్టుమీద’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి వంద మిలియన్లకు పైగా వ్యూస్ ని కొల్లగొట్టింది.
దీంతో జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 4.45 cr |
సీడెడ్ | 2.52 cr |
ఉత్తరాంధ్ర | 1.52 cr |
ఈస్ట్ | 1.65 cr |
వెస్ట్ | 1.42 cr |
కృష్ణా | 1.15 cr |
గుంటూరు | 1.65 cr |
నెల్లూరు | 0.65 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 15.01 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.5 cr |
ఓవర్సీస్ | 4 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 20.51 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజే ఈ సినిమా రూ.20.51 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 50 శాతం రికవరీ సాధించినట్టే. ఇక బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.20.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.