Mahesh Babu: బావ సినిమా పై మహేష్ బాబు రివ్యూ ఎలా ఉందంటే..?

సుధీర్ బాబు హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ నిన్న విడుదలైంది. ‘పలాస’ ఫేమ్ కరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. మొదటి షోతోనే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది ఈ సినిమా బాగుంది అంటే మరికొంత మంది బాలేదు అనడం లేదు కానీ రొటీనే అంటున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంది అని అంతా చెబుతున్న మాట. ’70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొదటి నుండీ ఈ చిత్రం పై మంచి హైప్ ఉంది కాబట్టి..

ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్టు ట్రేడ్ పండితుల సమాచారం. ఇక ఈ మూవీ పై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు సుధీర్ బాబు బావ మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు. ‘శ్రీదేవీ సోడా సెంటర్ రా అండ్ ఇంటెన్స్ మూవీ.. అంతేకాకుండా అదిరిపోయే క్లైమాక్స్ కూడా ఉంది. ‘పలాస’ తరువాత దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన బోల్డ్ మూవీతో మన ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే తన బెస్ట్ పెర్ఫార్మన్స్. నరేష్ గారు ఎప్పటిలానే అవలీలగా,అద్భుతంగా చేసి అలరించారు. హీరోయిన్ ఆనంది గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

శ్రీదేవి పాత్రలో ఆమె బాగా సెట్ అయ్యింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే దుమ్ములేపేసింది. అది మిస్ కాకూడదు. టీం అందరికీ కంగ్రాట్స్’ అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు మహేష్ బాబు. ఇక మహేష్ రివ్యూ ని సుధీర్ బాబు తన ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ.. ‘థాంక్యూ మహేష్.. ట్వీట్ చేసినందుకే కాదు.. ఇంత డిటైల్డ్ గా మా సినిమా గురించి వర్ణించినందుకు’ అంటూ పేర్కొన్నాడు.

1

2


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus