Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: బాలీవుడ్‌పై మహేష్‌బాబు సెన్సేషనల్‌ కామెంట్స్‌

Mahesh Babu: బాలీవుడ్‌పై మహేష్‌బాబు సెన్సేషనల్‌ కామెంట్స్‌

  • May 11, 2022 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: బాలీవుడ్‌పై మహేష్‌బాబు సెన్సేషనల్‌ కామెంట్స్‌

నొప్పింపక తానొవ్వక అనే స్టైల్‌లో మహేష్‌బాబు ఉంటారని అంటుంటారు. గత కొన్నేళ్లలో మహేష్‌ నుండి ఇలాంటి బిహేవియరే చూస్తూ వచ్చాం. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్‌ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసేలా కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌ సినిమా చేస్తారా? అంటూ ఆయనను ఓ న్యూస్‌ ఏజెన్సీ అడగగా.. దానికి ఆయన చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఇవి వింటే తెలుగు ప్రేక్షకులు హ్యాపీ ఫీల్‌ అవ్వొచ్చు. కానీ త్వరలో పాన్‌ ఇండియా స్టార్‌ అవుతున్న మహేష్‌ ఇలా మాట్లాడటం బాధాకరమే అని చెప్పొచ్చు.

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ అంటూ వుడ్‌లు వద్దు.. భారతీయ సినిమానే ముద్దు అంటూ ఓవైపు చర్చ జరుగుతుంటే మరోవైపు ఒక ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడం సరికాదు కదా. మొన్నామధ్య జాన్‌ అబ్రహం సౌత్‌ సినిమా ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా రీజనల్‌ సినిమాల గురించి పరుషంగా మాట్లాడాడు. దాంతో నెటిజన్లు అంతా అతన్ని ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు మహేష్‌బాబు కూడా ఇంచుమించుగా అంతే మాట అన్నాడు. దీంతో బాలీవుడ్‌ మీడియా, నెటిజన్లు కామెంట్స్‌ జోరు పెంచారు.

గత కొన్ని రోజులుగా ‘సర్కారు వారి పాట’, ‘మేజర్‌’ సినిమాల ప్రచారంలో మహేష్‌బాబు పాల్గొంటున్నాడు. దీంతో ఎప్పటిలాగే ‘మీరు బాలీవుడ్‌కి వెళ్తారా?’ అంటూ మీడియా అడిగింది. అలా ఓ వార్తా సంస్థ కూడా అడిగింది. ఎంతో మంది అడిగినా ‘నేను తెలుగు సినిమాలే చేస్తాను. ఇదే నాకు కంఫర్ట్‌. ఇదే నాకు చాలు’ అని చెప్పిన మహేష్.. ఆ వార్త సంస్థతో కాస్త హార్ష్‌గా మాట్లాడాడు. బాలీవుడ్ తనను భరించలేదని.. అక్కడ సినిమాలు చేసి టైం వేస్ట్ చేయను అంటూ చెప్పుకొచ్చాడు మహేష్.

దీంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో చిన్నపాటి షేక్‌ వచ్చింది. మహేష్ లాంటి స్టార్‌ హీరో ఇలా బాలీవుడ్‌ గురించి, బాలీవుడ్‌ సినిమాల గురించి మాట్లాడటం సరికాదు అని అంటున్నారు. ‘‘హిందీ ఇండస్ట్రీ నుండి నాకు బాగానే ఆఫర్లు వచ్చాయి. కానీ వారు నన్ను భరించగలరని నేను అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పని చేయడం టైం వేస్ట్ చేసుకోవడమే కదా’’ అని చెప్పాడు మహేష్‌. అంతేకాదు నాకు టాలీవుడ్‌లో బాగానే ఆఫర్స్ వస్తున్నాయి.

పైగా టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. అందుకే నా ఇండస్ట్రీని విడిచి మరేదో ఇండస్ట్రీకి వెళ్లి పని చేయాలనే ఆలోచన లేదు అని ముగించాడు మహేష్‌. అయితే ఈ విషయంలో మహేష్‌ ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ విషయం మాత్రం ‘బాలీవుడ్‌ మీద మహేష్‌ దండయాత్ర’ అనేలా ప్రొజక్ట్‌ అయ్యింది. చూద్దాం దీనిపై మహేష్‌ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Bollywood
  • #mahesh
  • #Mahesh Babu
  • #Sarkar Vaari Paata

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

17 mins ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

50 mins ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

4 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

7 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

7 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

7 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

7 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version