నొప్పింపక తానొవ్వక అనే స్టైల్‌లో మహేష్‌బాబు ఉంటారని అంటుంటారు. గత కొన్నేళ్లలో మహేష్ నుండి ఇలాంటి బిహేవియరే చూస్తూ వచ్చాం. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ సినిమా చేస్తారా? అంటూ ఆయనను ఓ న్యూస్ ఏజెన్సీ అడగగా.. దానికి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవి వింటే తెలుగు ప్రేక్షకులు హ్యాపీ ఫీల్ అవ్వొచ్చు. కానీ త్వరలో పాన్ ఇండియా స్టార్ అవుతున్న మహేష్ ఇలా మాట్లాడటం బాధాకరమే అని చెప్పొచ్చు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ అంటూ వుడ్‌లు వద్దు.. భారతీయ సినిమానే ముద్దు అంటూ ఓవైపు చర్చ జరుగుతుంటే మరోవైపు ఒక ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడం సరికాదు కదా. మొన్నామధ్య జాన్ అబ్రహం సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా రీజనల్ సినిమాల గురించి పరుషంగా మాట్లాడాడు. దాంతో నెటిజన్లు అంతా అతన్ని ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు మహేష్‌బాబు కూడా ఇంచుమించుగా అంతే మాట అన్నాడు. దీంతో బాలీవుడ్ మీడియా, నెటిజన్లు కామెంట్స్ జోరు పెంచారు.
గత కొన్ని రోజులుగా ‘సర్కారు వారి పాట’, ‘మేజర్’ సినిమాల ప్రచారంలో మహేష్‌బాబు పాల్గొంటున్నాడు. దీంతో ఎప్పటిలాగే ‘మీరు బాలీవుడ్‌కి వెళ్తారా?’ అంటూ మీడియా అడిగింది. అలా ఓ వార్తా సంస్థ కూడా అడిగింది. ఎంతో మంది అడిగినా ‘నేను తెలుగు సినిమాలే చేస్తాను. ఇదే నాకు కంఫర్ట్. ఇదే నాకు చాలు’ అని చెప్పిన మహేష్.. ఆ వార్త సంస్థతో కాస్త హార్ష్‌గా మాట్లాడాడు. బాలీవుడ్ తనను భరించలేదని.. అక్కడ సినిమాలు చేసి టైం వేస్ట్ చేయను అంటూ చెప్పుకొచ్చాడు మహేష్.
దీంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో చిన్నపాటి షేక్ వచ్చింది. మహేష్ లాంటి స్టార్ హీరో ఇలా బాలీవుడ్ గురించి, బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడటం సరికాదు అని అంటున్నారు. ‘‘హిందీ ఇండస్ట్రీ నుండి నాకు బాగానే ఆఫర్లు వచ్చాయి. కానీ వారు నన్ను భరించగలరని నేను అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పని చేయడం టైం వేస్ట్ చేసుకోవడమే కదా’’ అని చెప్పాడు మహేష్. అంతేకాదు నాకు టాలీవుడ్‌లో బాగానే ఆఫర్స్ వస్తున్నాయి.
పైగా టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. అందుకే నా ఇండస్ట్రీని విడిచి మరేదో ఇండస్ట్రీకి వెళ్లి పని చేయాలనే ఆలోచన లేదు అని ముగించాడు మహేష్. అయితే ఈ విషయంలో మహేష్ ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ విషయం మాత్రం ‘బాలీవుడ్ మీద మహేష్ దండయాత్ర’ అనేలా ప్రొజక్ట్ అయ్యింది. చూద్దాం దీనిపై మహేష్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!