Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ ధరించిన షర్ట్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. మహేష్ బాబు స్టైల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తైంది. మహేష్ బాబు ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. అయితే మహేష్ బాబు తాజాగా ఒక ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీకి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మహేష్ మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో మహేష్ ధరించిన షర్ట్ ఖరీదు 17,999 రూపాయలు కావడం గమనార్హం. షర్ట్ కోసం మహేష్ ఏకంగా 18 వేల రూపాయలు ఖర్చు చేశారు. సెలబ్రిటీలకు ఈ మొత్తం ఎక్కువ మొత్తం కాకపోయినా ఈ షర్ట్ ఖరీదు తెలిసి సామాన్య ప్రజలు మాత్రం అవాక్కవుతున్నారు. మహేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 80 నుంచి 90 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

గుంటూరు కారం సినిమాలో సైతం మహేష్ బాబు ఇదే తరహా షర్ట్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది. మహేష్ గుంటూరు కారం సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ లో సైతం కీలక మార్పులు జరిగాయని తెలుస్తోంది. మహేష్ బాబు అభిమానులను ఆశ్చర్యపరిచే సీన్లు ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.

మహేష్ బాబు (Mahesh Babu) పాన్ ఇండియా కథలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా పూర్తైన తర్వాతే మహేష్ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రానుంది. చాలా సంవత్సరాల క్రితమే మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతుండటం గమనార్హం.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus