Mahesh Babu: పాన్‌ ఇండియా సినిమా వస్తోంది.. మీరు ఆగండి.. నిజమేనా?

ఇప్పుడు కాదు కానీ.. ఓటీటీలు కాకుండా టీవీలదే రాజ్యం అనుకునే రోజులవి. ఏదైనా అగ్ర హీరో సినిమా ఆ వారం థియేటర్లలో రిలీజ్‌ అవుతోందంటే చాలు టీవీలో ఆ వారం ఆ హీరో, దర్శకుల సినిమాలు వేసేవారు. దీన్ని టైమ్లీ కాన్సెప్ట్‌ అంటారు.. ఇంకాస్త క్లియర్‌గా చెప్పాలంటే క్యాష్‌ చేసుకున్నారు అని అనొచ్చు. ఇలాంటిదే మరో కాన్సెప్ట్‌ ఏదైనా హీరో సినిమా ఒకటి పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ అవుతోంది అంటే పైన చేసిన పనే చేయడం.

Mahesh Babu

అంటే.. ఆ హీరో చేసిన పాత సినిమాలను, బాగున్న సినిమాలను డబ్బింగ్‌ చేసి ఇతర భాషల్లోకి రిలీజ్‌ చేస్తుంటారు. గతంలో కొంతమంది హీరోల విషయంలో ఇది జరిగింది. అంతేకాదు ఆ సినిమాల డబ్బింగ్‌ వెర్షన్లు భారీ విజయాల్ని కూడా అందుకున్నాయి. ఈ విషయం స్ట్రయిక్‌ అయిందో, లేక వేరే రకమైన ఆలోచన ఏమైనా వచ్చిందో కానీ.. మహేష్‌ బాబు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. తన సినిమాల విషయంలో మహేశ్‌ (Mahesh Babu)  జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బాలీవుడ్‌ వెండితెరపై రాజమౌళి (S. S. Rajamouli)  సినిమాతోనే పాన్‌ ఇండియా లెవల్‌లో లాంచ్‌ అవ్వాలని అనుకుంటున్నాడు. దీంతో ఆ సినిమా వచ్చేంతవరకు తన గత సినిమాలను హిందీలోకి డబ్‌ చేసి థియేటర్‌లలో రిలీజ్‌ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు మహేశ్‌ బాబు నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు. దీంతో బాలీవుడ్‌లో రాజమౌళి సినిమానే తొలి చిత్రమవ్వాలని అనుకుంటున్నాడట.

మరోవైపు రాజమౌళి సినిమాను ప్రకటించినప్పటి.. ఎలాంటి అప్‌డేట్స్‌ రావడం లేదు. అడిగితే రాజమౌళి పెద్ద రాడ్డు తీసుకొని కొట్టడానికి (సరదాగా) రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎంతవరకు ఈ పనులు సాగుతాయి అనేది తెలియడం లేదు. ఆ విషయం తేలితేనే సినిమా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌, పూజా కార్యక్రమాలు ఉంటాయి అని అంటున్నారు. చూద్దాం ఎప్పటికి సినిమా లైన్‌లోకి వస్తోందో చూడాలి.

 ఇలా కూడా బ్రేకప్‌ చెబుతారా? రకుల్‌ అయితే చెప్పేసింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus