సందీప్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్న మహేష్ బాబు

తొలి చిత్రంతోనే సందీప్ రెడ్డి సంచలన విజయం సాధించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా చూసిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని అభినందించారు. అంతేకాదు మంచి కథతో వస్తే నటిస్తానని సందీప్ రెడ్డి కి మాట కూడా ఇచ్చారు. సూపర్ స్టార్ పిలిచి డేట్స్ ఇస్తానంటే ఎవరైనా వదులుకుంటారా? అందుకే సందీప్ ఓ చక్కని స్టోరీ లైన్ ని తయారు చేసుకొని.. అంతకంటే చక్కగా మహేష్ బాబుకు వినిపించారు. ఆ లైన్ కి మహేష్ కనెక్ట్ అయ్యారని, పూర్తి స్క్రిప్ట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా సెట్స్ పైకి వెళదామని చెప్పినట్లు ఫిలింనగర్ వాసులు వెల్లడించారు.

అయితే ఈ మధ్యలో సందీప్ రెడ్డి కి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అర్జున్ రెడ్డిని హిందీలో తీయమని అడిగారు. ఇంత పెద్ద అవకాశాన్ని వదల్లేక మహేష్ కి ఈ విషయాన్నీ చెప్పుకున్నట్లు టాక్. ఆయన సందీప్ ని ప్రోత్సహించినట్లు తెలిసింది. హిందీలో సినిమా పనులు ముగిసిన తర్వాతే మన సినిమా మొదలు పెడదామని భరోసా ఇచ్చారంట. దీంతో సందీప్ రెడ్డి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధయైపోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వీటి తర్వాత సందీప్ రెడ్డి, మహేష్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus