Akhil,Mahesh Babu: ‘అఖిల్’ తర్వాత ‘ఏజెంట్’ కి కూడా మహేష్ బాబేనా..?

అక్కినేని అఖిల్ నటించిన 5వ సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది ఈ చిత్రం. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఏజెంట్’. ‘ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘సురేందర్ 2’ బ్యానర్ల పై రామబ్రహ్మం సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. ‘ఏజెంట్’ ప్రమోషనల్ కంటెంట్ కు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదు. దీంతో రకరకాలుగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లో మరో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఎన్ కన్వెన్షన్ లో మరో ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

నాగార్జున తో పాటు ఈ వేడుకకు మమ్ముట్టి కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా ఈ వేడుకకు అతిథిగా మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. (Akhil) అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ కు కూడా మహేష్ బాబు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ కాలేదు కానీ.. మహేష్ గెస్ట్ గా వెళ్లడం వల్ల బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో కూడా అతని పేరు మార్మోగింది.

మరి ఈసారి ఏమవుతుంది? మహేష్ నిజంగా వస్తున్నాడా.. లేదా అన్నది అధికారిక ప్రకటన వస్తేనే క్లారిటీ వస్తుంది. పైగా మహేష్ కు ఇండస్ట్రీ హిట్ ను అందించిన ‘పోకిరి’ రిలీజ్ డేట్ ఏప్రిల్ 28నే ‘ఏజెంట్’ కూడా విడుదల కాబోతుండటం విశేషం.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus