Mahesh Babu, Trivikram: మహేష్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చేది ఆరోజేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలలో అతడు సినిమా హిట్టైనా భారీ బడ్జెట్ తో తెరకెక్కడం వల్ల అతడు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. స్టార్ మా ఛానల్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయగా అతడు సినిమా వల్ల ఛానల్ కు భారీగా లాభాలు వచ్చాయి.

ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఖలేజా మూవీ తెరకెక్కింది. వేర్వేరు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. కథ, కథనం బాగానే ఉన్నా మహేష్ బాబును త్రివిక్రమ్ దేవుడిగా చూపించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కమర్షియల్ గా ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు మహేష్ త్రివిక్రమ్ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ వచ్చారు. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ నెల 31వ తేదీన ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బోగట్టా. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ రానుందని తెలుస్తోంది.

జులై నెల నుంచి మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మహర్షి సినిమా తర్వాత మరోసారి మహేష్ బాబు, పూజా హెగ్డే ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారు. ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus